ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: పాడి గేదెల సహాయంతో పేదరైతు వ్యవసాయం - Agriculture latest news

ఆర్థిక స్థోమత లేకపోయినా... పాడి గేదెల సాయంతో వ్యవసాయం చేస్తున్నాడు ఓ రైతు. ఎకరం స్థలంలో మిరప.. మరొక అరెకరంలో పత్తిని సాగు చేస్తున్నాడు.

poor farming with the help of dairy buffaloes in khammam district
తెలంగాణ:పాడి గేదెల సహాయంతో పేదరైతు వ్యవసాయం

By

Published : Oct 6, 2020, 2:45 PM IST

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఒక పేద రైతు తనకున్న ఎకరన్నర పొలంలో గేదల సహాయంతో వ్యవసాయం చేస్తున్నాడు. ఆర్థిక స్థోమత అంతగా లేని అతను.. పాడి గేదెల సహాయంతో ఎకరం స్థలంలో మిరప.. మరొక అరెకరంలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు.

భార్య వెంకటలక్ష్మి సహాయంతో పాడి గేదెలను వినియోగిస్తూ మిరప తోట పనులు చేస్తున్నాడు. గేదలు సైతం రైతుకు వ్యవసాయంలో సహకరించే చేస్తూ తోడ్పాటును అందిస్తున్నాయి. సరైన ఆలోచన ఉంటే కష్టాన్ని అధిగమించి ముందుకు వెళ్లవచ్చని ఈ దంపతులు నిరూపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details