ఏలూరు వింతవ్యాధి ఘటన తర్వాత ఆక్వా సాగు ప్రాంతాల్లోని నీటిని తరచుగా పీసీబీ పరీక్షలు చేయనుంది. రసాయనాలు, భారలోహాల స్థాయిని పరీక్ష చేస్తామని పీసీబీ కార్యదర్శి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలిదశ కింద నగరాల్లో పరీక్షలు చేయగా.. రెండోదశలో పురపాలికలు, మేజర్ పంచాయతీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నదులు, సరస్సులు, కాలువలు, జలాశయాల్లో ప్రతినెలా పరీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భూగర్భ జలాల ద్వారా నీరు అందించే ప్రాంతాల్లో 6 నెలలకు ఒకసారి పరీక్షలు జరగనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా నీటికి రెండు దశల్లో పీసీబీ పరీక్షలు - రాష్ట్రవ్యాప్తంగా నీటి పరీక్షలు న్యూస్
ఏలూరు ఘటన తర్వాత పలుచోట్ల నీటి నాణ్యత పరిశీలించాలిని పీసీబీ(కాలుష్య నియంత్రణ బోర్డు) నిర్ణయించింది. ఆక్వా సాగు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా నీటికి రెండు దశల్లో పీసీబీ పరీక్షలు