ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిషత్ పోరు: మధ్యాహ్నం 1 గంటలు పోలింగ్ శాతం 37.26

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 37.26 పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 44.38 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా గంటూరు జిల్లాలో 27.26 శాతంగా ఉంది.

Polling percentage in Parishad election
మందకొడిగా పరిషత్ ఎన్నికల పోలింగ్

By

Published : Apr 8, 2021, 3:09 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 37.26 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్ నెమ్మదిగానే కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు 7.76 శాతం పోలింగ్ నమోదవగా.. ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం నమోదైంది.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ శాతం వివరాలను జిల్లాల వారీగా పరిశీలిస్తే... విజయనగరం జిల్లాలో అత్యధికంగా 44.38 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది. విశాఖపట్నంలో 42.1, పశ్చిమ గోదావరి 41.9, చిత్తూరు 41.87, తూర్పు గోదావరి 41, కర్నూలు 40.25, అనంతపురం 37.79, శ్రీకాకుళం 36.62, కృష్ణా 36.02, నెల్లూరు 34.2, కడప 33.6, ప్రకాశం 27.44, గుంటూరులో అత్యల్పంగా 27.26 పోలింగ్ శాతం నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details