రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 13 జిల్లాల్లోని 2,786 పంచాయతీల్లో రెండోదశలో పోలింగ్ జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు కదిలారు. పోలింగ్ ముగిసేసరికి 81.67 శాతం నమోదైంది. విశాఖపట్నంలో అత్యధికంగా 84.94 శాతం పోలింగ్ నమోదైంది.
ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ - పంచాయతీ ఎన్నికలు తాజా వార్తలు
15:36 February 13
రెండోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.
రెండోదశలో 2,786 సర్పంచ్ స్థానాలకు పోటీ పడతున్న 7,507 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు పూర్తికాగానే వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. రెండోవిడతలో 539 పంచాయతీలు, 12,604 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా చూస్తే రెండో విడత ఎన్నికలు ప్రశాతంగా సాగాయి. కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా మారెల్లవారిపాలెం, నెల్లూరు జిల్లా చిరమన పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో పోలింగ్ నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకే పోలింగ్ ముగిసింది.
ఇదీ చదవండి:పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 12.30 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే..