ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న న్యాయపోరాటానికి తెలుగుదేశం నేతలు పూర్తి మద్దతు తెలపాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శ్రేణులను ఆదేశించారు. ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్న నిరనస కార్యక్రమాలకు మద్దతు పలకాలని సూచించారు. జగన్ రివర్స్ పీఆర్‌సీతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని మాజీమంత్రి నక్క ఆనందబాబు విమర్శించారు. ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ఆపి ఉద్యోగుల ప్రయోజనాల కోసం రోడ్డెక్కాలని కోరారు.
PARTIES SUPPORT : ఉద్యోగ సంఘాల ఆందోళనకు విపక్షాల మద్దతు - employees union protest
ఉద్యోగ సంఘాలు తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి రాష్ట్రంలోని విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై ఆయా పార్టీల నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసం చేసిందన్న తెలుగుదేశం వారు చేసే ఏ పోరాటానికైనా మద్దతిస్తామని ప్రకటించింది. భాజపా- జనసేనతోపాటు సీపీఐ నేతలు సైతం ఉద్యోగుల వెంట నడుస్తామని తెలిపారు.
ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకోవాలి కానీ బెదిరింపులు తగవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ఉద్యోగ సంఘాల నేతలను బెదిరించి ఒప్పించిన రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల ఆగ్రహాన్ని మాత్రం ఆపలేకపోయిందన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు సర్కార్‌కు వత్తాసు పలికి చేతులు కాల్చుకున్నారని భాజపా విమర్శించింది. ఉద్యోగులు ఇప్పటికైనా ఐక్యంగా పోరాడితే పార్టీ అండగా ఉంటుందని తెలిపింది. పీఆర్సీ ద్వారా ఉద్యోగాలు పెరగకపోగా ఉన్న జీతాలే తగ్గించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వం తీరు చూస్తే కాల్‌మనీ, వడ్డీ వ్యాపారులు బకాయిలు వసూలు చేసుకున్నట్లు ఉందన్నారు.
ఇదీచదవండి.