దుండగుల దాడిలో గాయాలపాలై చికిత్స పొందుతున్న తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పలువురు నేతలు పరామర్శించి సంఘీభావం తెలిపారు. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పట్టాభిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, తెదేపా జిల్లా పరిషత్ మాజీఛైర్పర్సన్ గద్దె అనురాధ పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని తామంతా అండగా ఉన్నామని భరోసా కల్పించారు. ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
పట్టాభిని పరామర్శించిన పలువురు నేతలు - పట్టాభి న్యూస్
దుండగుల దాడిలో గాయాలపాలై చికిత్స పొందుతున్న తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను రాజకీయ నాయకులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ధైర్యంగా ఉండాలని తామంతా అండగా ఉన్నామని నేతలు భరోసా కల్పించారు.
పట్టాభిని పరామర్శించిన పలువురు రాజకీయ నేతలు