జిల్లా కేంద్రాలను అక్రమ మద్యం, పేకాట, క్రికెట్ బెట్టింగ్ డెన్లుగా మార్చేలా నేరచరితులకు జెడ్పీ ఛైర్మన్, ఎంపీపీ పదవులు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి జవహర్(Jawahar) దుయ్యబట్టారు. 'రాజకీయ నేరస్థులు అణుబాంబులకంటే ప్రమాదకరం' అని దుయ్యబట్టారు.
Jawahar: రాజకీయ నేరస్థులు అణుబాంబుల కంటే ప్రమాదకరం: జవహర్ - జవహర్
'రాజకీయ నేరస్థులు అణుబాంబుల కంటే ప్రమాదకరం' అని మాజీ మంత్రి జవహర్(Jawahar) విమర్శించారు. జిల్లా కేంద్రాలను అక్రమ మద్యం, పేకాట, క్రికెట్ బెట్టింగ్ డెన్లుగా మార్చేలా నేరచరితులకు జెడ్పీ ఛైర్మన్, ఎంపీపీ పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి జవహర్
అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని కర్నూలు జెడ్పీ ఛైర్మన్గా నియమిస్తున్నారని ఆరోపించారు. ప్రజా స్వామ్యాన్ని హత్య చేసే రీతిలో నేరస్థులకు పదవులిస్తున్నారు. పదవుల కేటాయింపునకు మాఫియాలో పనిచేయడమే ప్రధాన అర్హతగా పరిగణించటం సిగ్గుచేటని అని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:Pawan: ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు.. వైకాపా దాష్టీకాలను దీటుగా ఎదుర్కొంటాం: పవన్