విజయవాడ నగరంలో కరోనా కట్టడికి నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న పలువురు పోలీసులు వైరస్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రద్దీ ప్రాంతాలు, రైతుబజార్లు, సూపర్‌మార్కెట్లు, కిరాణా దుకాణాలకు వస్తున్న ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదు. ఆయా ప్రాంతాలకు వెళ్తున్న పోలీసులు రద్దీని క్రమబద్ధీకరించే క్రమంలో చేతి తొడుగులు లేకుండానే వాహనాలను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ రెడ్‌జోన్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. ఆదివారం ఒక్క రోజే తొమ్మిది మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఒక ఉన్నతాధికారి, ఒక మహిళా ఎస్సై ఉన్నారు. దీంతో విజయవాడలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డుకు పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒకరు రాజీవ్‌నగర్, మరొకరు పాతపాడులో నివాసముంటున్నారు. వీరిని ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు విధి నిర్వహణలోనే ఉండడం గమనార్హం.
విజయవాడ పోలీసులపై కరోనా పంజా - corona in vijayawada
విజయవాడ పోలీసులపై కరోనా పంజా విసురుతోంది. నిన్న ఒక్క రోజే నగరంలో 9 మంది పోలీసులకు పాజిటివ్ రావడం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజల నిర్లక్ష్యం పోలీసన్నలకు శాపంగా మారింది.
పోలీసులకు సోకుతున్న కరోనా మహమ్మారి
* మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు పోలీసులకు పాజిటివ్ వచ్చింది. వీరు మధురానగర్, సత్యానారాయణపురం, యనమలకుదురు, సింగ్‌నగర్‌లలో నివాసముంటున్నారు.
* కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో పని చేసే ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు ఆదివారం పాజిటివ్‌గా తేలింది. ఇతను భ్రమరాంభపురంలో నివాసముంటున్నాడు.