తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనాన్ని పోలీసులు అడ్డుకోవటం సరికాదని.. ఆ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డుండి రాకేష్ మండిపడ్డారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అనుమతులు లేవని పేర్కొనడాన్ని ఖండించారు.
తెదేపా ఆర్యవైశ్య సమ్మేళనాన్ని అడ్డుకున్న పోలీసులు
విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో.. తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సమ్మేళనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఆ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డుండి రాకేష్, తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఈ చర్యను హేయమైనదిగా అభివర్ణించారు.
కరోనా సమయంలో ఆర్యవైశ్యులకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు.. తెదేపా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్యవైశ్యులు హాజరయ్యారన్నారు. పోలీసులు అడ్డుకోవటంతో ఆటోనగర్‌లోని జిల్లా తెదేపా కార్యాలయంలో సమావేశం నిర్వహించామన్నారు. కొవిడ్ ధాటికి నష్టపోయిన ఆర్యవైశ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలి: ఏపీఎన్జీవో