christian and muslim chariots seized: మహా పాదయాత్రలో ఉన్న క్రైస్తవ, ముస్లిం రథాల్ని పోలీసులు సీజ్ చేశారు. బుధవారం పాదయాత్ర వెనుక వాహనాల్ని పంపిస్తామని చెప్పటంతో.. రైతులు ఆందోళన విరమించగా పాదయాత్ర ముందుకు కదిలాక డ్రైవర్లను బెదిరించి వాహనాల తాళాలు పోలీసులు తీసుకున్నారని రైతులు తెలిపారు. రైతులతో మాట్లాడిన క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు తమ మతాచారాలు కించపరిచే విధంగా పోలీసుల చర్యలున్నాయని.. ఆగ్రహానికి గురయ్యారు. ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు రైతులకు సంఘీభావం తెలిపారు. ఫాస్టర్లు రైతులతో ఫోన్లో మాట్లాడి సంఘీభావం తెలిపారు.
మహా పాదయాత్ర 32వ రోజైన నేడు.. మరుపల్లి దగ్గర ప్రారంభవుతుంది. అక్కడి నుంచి మధ్యాహ్న భోజన సమయానికి డేగపూడి మీదుగా తుమ్మలతలుపులు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భోజన విరామం అనంతరం.. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమై తురిమెర్ల వద్దకు చేరుకుంటారు. మొత్తం 14కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.