ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Suicide attempt in Varanasi : ఆత్మహత్య చేసుకోవాలని.. వరంగల్ నుంచి కాశీ వెళ్లాడు..! - వారణాసిలో వరంగల్​ వాసి ఆత్మహత్యాయత్నం

Suicide attempt in Varanasi : కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే భావనతో.. చాలా మంది తమ వృద్ధాప్యంలో కాశీకి చేరుకుంటారు. అక్కడ మరణిస్తే తమ జీవిత కాలంలో చేసిన పాపాలు తొలగిపోతాయని ఓ నమ్మకం. అయితే.. తెలంగాణకు చెందిన ఈ వ్యక్తి మాత్రం ఇంకా వృద్ధాప్యానికి చేరుకోకముందే మోక్షం పొందాలనుకున్నారు. అందుకే ఎవరికీ చెప్పకుండా అక్కడికి చేరుకున్నారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గంగానదికి చేరుకోగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను రక్షించారు. ఆత్మహత్య చేసుకోవడానికి అంతదూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావని పోలీసులు, మీడియా అడగగా.. అతను తన గోడు వెళ్లబోసుకున్నాడు.

Suicide attempt in Varanasi
ఆత్మహత్య చేసుకోవాలని వారణాసి వచ్చిన వరంగల్ వాసి

By

Published : Dec 19, 2021, 8:18 PM IST

Suicide attempt in Varanasi: అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందామని ఉత్తరప్రదేశ్​లోని వారణాసికి వెళ్లిన తెలంగాణలోని వరంగల్​ కి చెందిన వ్యక్తిని అక్కడి పోలీసులు రక్షించారు. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవడంతో.. అప్పుల బాధ భరించలేక మోక్షం పొందడం కోసం ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు పోలీసులకు తెలిపారు. వరంగల్​ జిల్లా కొత్తగట్టుకు చెందిన శ్రీనివాస్​.. ఇటీవల వేసిన మద్యం షాపుల టెండర్లలో తనకు రూ. 50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదని.. అప్పులు తీరే మార్గం లేక చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని భావించి.. ఆత్మహత్య చేసుకున్న పాపం కూడా పోతుందని వారణాసికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.

మళ్లీ రానని చెప్పి..
ఈ నెల 17 న వారణాసికి చేరుకున్న శ్రీనివాస్​ తన పేరు, చిరునామా తప్పుగా చూపిస్తూ ఓ ఆశ్రమంలో గది తీసుకున్నారు. తరువాత భార్యకు ఫోన్​ చేసి పిల్లలు జాగ్రత్త అని చెప్పి.. తను ఇక తిరిగి రానని.. చనిపోవాలనుకున్నట్లు భార్యతో చెప్పారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి గంగా నది ఘాట్​కు చేరుకున్నారు. భర్త మాటలతో ఆందోళన చెందిన భార్య వెంటనే వారణాసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని శ్రీనివాస్​ ఆచూకీని గుర్తించి రక్షించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. సురక్షితంగా వారికి అప్పగించారు.

ఇదీ చదవండి:LIVE Video : క్షణాల్లో కాలి బూడిదైన కారు.. సోషల్ మీడియాలో వైరల్!

ABOUT THE AUTHOR

...view details