Police rescued: వందకు ఫోన్ చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. వంద రూపాయల విషయంలో గొడవపడి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అడ్లూర్ శివారులో జరిగింది.
వంద కోసం భార్యతో గొడవపడి..

జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన అజీజ్ పెయింటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వంద రూపాయల విషయంలో భార్యతో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అజీజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అడ్లూర్ శివారులోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటూ భార్యకు వీడియో కాల్ చేశాడు.
దీంతో అతని భార్య వెంటనే 100కు డయల్ చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు అతని చరవాణి ఆధారంగా లోకేషన్ గుర్తించి రక్షించారు. అజీజ్‌ను కాపాడినందుకు అతని కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శరవేగంగా స్పందించి వ్యక్తి ప్రాణాలు రక్షించిన కామారెడ్డి పట్టణ సీఐ నరేశ్, కానిస్టేబుల్ శరత్ బాబు, హోంగార్డు అమీర్‌ను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చూడండి: