విజయవాడ సింగ్ నగర్లో కరోనాపై పోలీసులు అవగాహన ర్యాలీ చేశారు. సీఐ లక్ష్మీనారాయణ నేతృత్వంలో వాహనాలతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. కరోనా పట్ల అజాగ్రత్తగా ఉంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోలీసు పెట్రోలింగ్... అప్రమత్తతపై అవగాహన - విజయవాడ కరోనా కేసులు
కరోనా బెడవాడను బేజారెత్తిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. లాక్డౌన్ మరింత కఠినం అమలుచేస్తేనే కేసుల కట్టడి సాధ్యమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసుల ఉద్ధృతి నేపథ్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.
పోలీసు పెట్రోలింగ్... అప్రమత్తతపై అవగాహన