Seized: హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి నుంచి కోటి 90 లక్షల రూపాయల నగదును చిల్లకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించి మల్లాది మురళీ మోహన్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగదుకు సంబంధించిన వివరాలు లేకపోవడంతో ఐటీ(income tax) వారికి పంపిస్తామని పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టలు.. పోలీసుల అదుపులో ఇద్దరు! - ఆర్టీసీ బస్సులో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం
Seized: జగ్గయ్యపేటలోని విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల వద్ద భారీగా నగదు బయటపడింది. ఈ డబ్బును చిల్లకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్టీసీ బస్సులో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం