ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఐపీఎస్​లపై అనుచిత వ్యాఖ్యలు తగదు.. బహిరంగ క్షమాపణ చెప్పాలి' - ayennapatrudu comments on ias officials

పోలీసుల వ్యవస్థపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పోలీసు సంఘం డిమాండ్ చేసింది.

జనుకుల శ్రీనివాస్
జనుకుల శ్రీనివాస్

By

Published : Sep 18, 2021, 5:28 PM IST

డాక్టర్ కోడెల శివప్రసాద్ సంతాప సభలో తెదేపా నేత అయ్యన్నపాత్రుడు పోలీస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జనుకుల శ్రీనివాస్ విజయవాడలో అన్నారు. గతంలో గౌరవప్రదమైన మంత్రి పదవుల్లో ఉన్న అయ్యన్న పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న పోలీస్ అధికారులను కించపరిచేలా మాట్లాడిన ఆయనకు భవిష్యత్తులో గౌరవప్రదమైన పదవులు ఇవ్వకూడదని కోరుతున్నామన్నారు. పోలీసు వ్యవస్థ ఎంత కఠినతరమైనదో ఆయనకు తెలుసని, అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఆశ్రయించాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరైన పద్ధతికాదని అన్నారు.

క్షమాపణ చెప్పండి..

ఐపీఎస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు నాగిని అభిప్రాయపడ్డారు. అయ్యన్న లాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఉందన్నారు. అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

RAIN ALERT: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో వర్షాలు

ABOUT THE AUTHOR

...view details