ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి.. పోలీసుల ముందస్తు అరెస్టులు

By

Published : Feb 9, 2022, 10:16 PM IST

Updated : Feb 10, 2022, 7:35 AM IST

Unemployed youth protest: రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు. అయితే.. ఈ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. పలు చోట్ల విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.

Unemployed youth protest at collectorates
రాష్ట్రవ్యాప్తంగా రేపు కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగుల ఆందోళనలు

Unemployed youth protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు.. నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్​తో నిరుద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. జిల్లాల్లోని విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. కొన్నిచోట్ల పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

కడపలో పోలీసుల ఆంక్షలు..
కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట.. గురువారం నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో.. పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. విద్యార్థులను ధర్నాకు పంపొద్దని కళాశాల యాజమాన్యాలకు సూచించారు.

తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరెస్టు..
కర్నూలు జిల్లాలో.. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్‌నాయుడును ఆదోని పోలీసులు అరెస్టు చేశారు. చలో కలెక్టరేట్ పిలుపు నేపథ్యంలో.. ముందుస్తుగా అరెస్టు చేశారు.

విశాఖలో..

ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్​ను ముట్టడించనున్నారు. కేజీహెచ్‌ ఓపీ గేట్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థి సంఘాల ఐకాస ర్యాలీ చేపట్టనుంది. ఉదయం 10 గంటలకు ర్యాలీ చేయనుంది.

ఇదీ చదవండి:

TDP Leader Dhulipala on Mining : ప్రజాప్రతినిధుల అండతోనే మైనింగ్ - ధూలిపాళ్ల నరేంద్ర

Last Updated : Feb 10, 2022, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details