ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంబులెన్స్​ల నిలిపివేతతో... ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద ఉద్రిక్తత - అంబులెన్సులు నిలిపివేస్తున్న తెలంగాణ పోలీసులు

తెలంగాణ సరిహద్దుల్లో రాష్ట్ర నుంచి వెళ్తున్న అంబులెన్స్​లను నిలిపివేయడం.. ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ తరహా ఘటనలపై ఇటీవల ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు వాటిని ఖాతరు చేయడం లేదు. కనీసం మానవత్వాన్ని మరచి.. ప్రాణాపాయంలో ఉన్న రోగుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ambulances not allowing in borders
ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత

By

Published : May 14, 2021, 5:19 PM IST

అంబులెన్స్​ల నిలిపివేతతో ఉద్రిక్తత

రాష్ట్రం నుంచి కొవిడ్‌ రోగులను తెలంగాణకు తీసుకెళ్తున్న అంబులెన్స్‌లను.. ఆ రాష్ట్ర పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో బాధితుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. అంబులెన్స్​ల నిలిపివేతతో ఉద్రికత పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్​రోడ్ చెక్​పోస్ట్ వద్ద అనుమతి పత్రాలు లేని అంబులెన్స్‌లను నిలిపివేశారు.

ఇదీ చదవండి:గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక 76మంది మృతి

ప్రభుత్వ విప్‌ ఉదయభాను, తెదేపా నాయకులు నెట్టెం రఘురాం అక్కడికి చేరుకుని పోలీసులతో మాట్లాడారు. ఈ-పాస్​లు ఉంటేనే తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తామని వారు తేల్చిచెప్పారు. అనుమతులు లేని వాహనాలను తిప్పి పంపించేస్తున్నామన్నారు. ఈ ఆంక్షలతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని.. రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సరిహద్దులో మారని తెలంగాణ పోలీసుల తీరు.. వెనక్కి వెళ్తున్న అంబులెన్సులు

ABOUT THE AUTHOR

...view details