విజయవాడలో ఇటీవల సంచలనం రేపిన పుట్ బాల్ ప్లేయర్ ఆకాష్ హత్య, వన్‌టౌన్ కనకదుర్గా బార్ వద్ద హత్యాయత్నం ఘటనల తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. బార్ అండ్ రెస్టారెంట్లపై నిఘా పెట్టారు. నగరంలో జరుగుతున్న.. 60 శాతం నేరాలకు బార్‌లే కేంద్ర బిందువని గుర్తించిన పోలీసులు.. హత్యలు , దాడులకు ఇక్కడే పథక రచన జరుగుతోందని గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటి యజమానులతో డీసీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రతి రెస్టారెంట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించాలని యజమానులకు స్పష్టం చేశారు. ఐపీ అడ్రస్ ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైనా ఘర్షణ జరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. చాలా మంది గొడవలు, ఘర్షణలు ,ప్రమాదాలు జరిగినా రహస్యంగా ఉంచుతున్నారని..ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.