అసెంబ్లీకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహన కాన్వాయ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. మందడం చెక్ పోస్ట్ దగ్గర తెదేపా నేతలను పోలీసులు నిలువరించారు. దాంతో పోలీసులు, తెదేపా నేతలు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు తీరును నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నేతల నివాళులు
గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు ఆర్పించారు. అమరావతి మహిళలు లోకేశ్‌కు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభం రోజు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శాసనసభ పక్షం నివాళులర్పించడం అనవాయితీగా వస్తుంది. ప్రతిసారి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమం.. ఈసారి ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో.. లోకేశ్ నేతృత్వంలో నిర్వహించారు.