మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోసం మచిలీపట్నంలోని ఆయన కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బందరు డీఎస్పీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కలిసి సోదాలు నిర్వహించారు. ఇటీవల బందరులో జరిగిన భాస్కరరావు హత్య కేసుతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు సంబంధం ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోసం పోలీసుల గాలింపు - former minister Kolu Ravindra news
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. బందరులో ఇటీవల జరిగిన వైకాపా నాయకుడు హత్య కేసులో ఆయనకు సంబంధం ఉందని ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. కొల్లు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కార్యాలయంలో పోలీసుల తనిఖీలు