రాష్ట్ర వ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కడప జిల్లా పోరుమామిళ్లలో వంతెనపై చిక్కుకున్న ఐదుగురు మహిళ కూలీలను పోలీసులు రక్షించారు. కొట్టాలపల్లి గ్రామం నుంచి గానుగపెంటకు కూలీ పనుల వచ్చిన మహిళలు... తిరుగు ప్రయాణంలో నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. మహిళల కేకలు విని హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, ఓబులేసు... బాధిత మహిళలను ఒడ్డుకు చేర్చారు. ఐదుగురి ప్రాణాలను కాపాడిన సిబ్బందిని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.
చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఆకుల వారిపల్లికి చెందిన ఆరుగురు నదీ ప్రవాహంలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారితో సహా పలువురు పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో చిక్కుకున్న వారిని క్రేన్ సహాయంతో కాపాడారు.