విజయవాడలోని శివప్రసాద్ అనే వ్యక్తి కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆయన భార్య కుమారి సాయం కోసం ఎంతోమంది దగ్గరకు కాళ్లరిగేలా తిరిగారు. స్పందన లేక ఆశలు ఆవిరయ్యాయి... ఇక చావే శరణ్యమని... ఇదే ఆఖరి క్షణమంటూ కాలమెళ్లదీస్తోంది ఆ కుటుంబం. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ పశ్చిమ జోన్ పోలీసులు స్పందించారు. భాధిత కుటుంబానికి వారి వంతు సాయం చేశారు. మేమున్నామంటూ కొండంత భరోసానిచ్చారు. బాధిత కుటుంబానికి ధైర్యాన్ని నింపి స్పూర్తిధాతలయ్యారు.
ఈ పోలీసులు.. మనసున్న మహారాజులు! - police help to family in vijaywada news
కదల్లేని స్థితిలో మంచాన పడ్డ భర్త ఒక వైపు... కళ్ల ముందే ఏమీ తెలియని ఇద్దరు పసి పిల్లలు... అద్దె కూడా కట్టలేని దుస్థితి... అయినా బతుకుపై ఎదో ఆశ. సాయం కోసం ఎదురుచూపులు. అలాంటి కుటుంబానికి పోలీసులు భరోసాగా నిలిచారు.
police help to disabled person in vijayawada