ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP: దాడి ఘటనపై కోర్టును ఆశ్రయించనున్న తెదేపా ! - tdp latest news

తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయించాలని తెలుగుదేశం భావిస్తోంది. దాడి విషయమై ఈనెల 19వ తేదీనే ఆపార్టీ మంగళగిరి రూరల్ పీఎస్​లో ఫిర్యాదు చేసింది.

దాడి ఘటనపై కోర్టును ఆశ్రయించనున్న తెదేపా!
దాడి ఘటనపై కోర్టును ఆశ్రయించనున్న తెదేపా!

By

Published : Oct 21, 2021, 9:20 PM IST

తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయించాలని తెలుగుదేశం భావిస్తోంది. దాడి విషయమై ఈనెల 19వ తేదీనే ఆ పార్టీ మంగళగిరి రూరల్ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. పార్టీ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమార స్వామి పేరుతో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో సీఎం, సీఎంఓ అధికారులు, డీజీపీల పేర్లను ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేశారు. దురుద్దేశ్యంతో ప్రణాళిక ప్రకారం సీఎం, డీజీపీలు దాడికి కుట్ర పన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైకాపా నేత దేవినేని అవినాశ్ ప్రొద్భలంతో పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని తెదేపా ఫిర్యాదులో స్పష్టం చేసింది. ఫిర్యాదు చేసి 24 గంటలు పూర్తైనా..ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై తెదేపా నేతలు తప్పు పడుతున్నారు. సీఎం, సీఎంఓ, డీజీపీ పేర్లు ఉండబట్టే ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేస్తున్నారని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:

కడప: ఆదిరెడ్డిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details