విజయవాడ సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమచారం. నిందితులు గోవాలో ఉన్నట్టు ప్రత్యేక బృందాలు పసిగట్టాయి. అక్కడి పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. నిందితులను విచారించాక హత్య కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఘటన వివరాలివే..
విజయవాడ నున్న బైపాస్‌రోడ్డులోని సాయిరూపా బార్ సమీపంలో శనివారం అర్ధరాత్రి.. పోలీసు కమిషనరేట్ కార్యాలయ ఉద్యోగి గజకంటి మహేష్ (33)ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు అక్కడికొచ్చి వారిపై పది రౌండ్ల కాల్పులు జరిపారు. మహేష్ గొంతు, ఛాతీలోకి మూడు తూటాలు దూసుకెళ్లటంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతని స్నేహితుడు కుర్రా హరికృష్ణకు పొట్టను చీల్చుకుంటూ ఓ తూటా దూసుకెళ్లింది. మహేష్‌ను స్నేహితులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించేసరికే అతను మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన హరికృష్ణ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన తర్వాత.. హరికృష్ణ కారులోనే హంతకులు పరారయ్యారు. ఘటనాస్థలం నుంచి 5-6 కి.మీ దూరంలోని ముస్తాబాద్‌కు వెళ్లే మార్గం వద్ద ఓ కలప డిపో ముందు కారును వదిలేసి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఈ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి
జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అక్టోబరు 20కు వాయిదా