కరోనా విజృంభిస్తున్న వేళ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. విజయవాడలో కర్ఫ్యూ సమయంలో తెరిచి ఉంచిన దుకాణాలు, రెస్టారెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. భారీగా జరిమానాలు విధించారు. 24 గంటల్లో రూ. 6.46 లక్షల జరిమానాను వసూలు చేశారు. అలాగే మాస్కులు ధరించని వారి పని పడుతున్నారు. నగరంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 381 మందికి ఫైన్ విధించారు.
కర్ఫ్యూవేళ దుకాణాలు తెరిచారు... అడ్డంగా బుక్కయ్యారు.. - vijayawada latest updates
కర్ఫ్యూ సమయంలో తెరిచి ఉంచిన దుకాణాలు, రెస్టారెంట్లకు పోలీసులు షాకిచ్చారు. విజయవాడలో దుకాణాలు తెరిచి ఉంచినందుకు 24 గంటల్లో రూ.6.46 లక్షలను వసూలు చేశారు.
కర్ఫ్యూవేళ తెరచి ఉంచిన దుకాణాలకు జరిమానా విధించిన పోలీసులు