ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ యువతి హత్య కేసు దర్యాప్తు వేగవంతం - విజయవాడ క్రేమ్ న్యూస్

విజయవాడ బీటెక్‌ విద్యార్థిని హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా... మరింత సమాచారం కోసం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నిందితుడు నాగేంద్రను న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. అతని నుంచి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు గురువారం భీమవరం తీసుకువెళ్లి విచారించారు.

దివ్య తేజస్విని హత్య కేసు దర్యాప్తు వేగవంతం
దివ్య తేజస్విని హత్య కేసు దర్యాప్తు వేగవంతం

By

Published : Nov 20, 2020, 6:34 AM IST

నాగేంద్ర ఎప్పుడైనా భీమవరం వచ్చాడా..? బాధితురాలితో అతనికి ముందే పరిచయం ఉందా..? అనే విషయాలను ఆమె సహ విద్యార్థులు, స్నేహితులను అడిగి తెలుసుకున్నారు. నాగేంద్ర తాను ఆమెను భీమవరంలో ఎపుడు కలిసింది తదితర విషయాలను పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. దీంతో పాటు పలు కీలక వివరాలను పోలీసులు నాగేంద్ర నుంచి రాబట్టారు.

ఛార్జిషీటులో పలు అంశాలు:యువతిని ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గదిలోకి వచ్చి కత్తితో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు ఛార్జిషీటులో పొందుపరిచినట్లు సమాచారం. హత్యానంతరం అరగంట సేపు అక్కడే ఉన్నాడని, బాధితురాలి తల్లి రావడంతో తనకు తాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఫోరెన్సిక్‌, పోస్ట్‌మార్టం నివేదికలో హత్య జరిగినట్లు తేలిందని ఇదే విషయాన్ని ఛార్జిషీటులో పోలీసులు పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మూడు రోజుల విచారణ అనంతరం నాగేంద్ర చెప్పిన అంశాలతో అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం సాయంత్రంతో నాగేంద్ర పోలీసు కస్టడీ ముగుస్తుందని ఈ లోగా అతని నుంచి వీలైనంత సమాచారం రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి:గిరిజనులను కబళిస్తున్న అంతుచిక్కని వ్యాధి

ABOUT THE AUTHOR

...view details