ఏపీలో ఈఎస్ఐ స్కాం సంచలనంగా మారింది. ఈ కుంభకోణంలో తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఈరోజు తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానం నాలుగు రోడ్లు కూడలిలో పోలీసులు భారీగా మోహరించారు.
అచ్చెన్నాయుడిని విజయవాడ తరలించిన పోలీసులు
ఈఎస్ఐ అవినీతి కుంభకోణంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించారు. వైద్యపరీక్షల అనంతరం ఆయన్ను విజయవాడ అనిశా కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అచ్చెన్నాయుడిని విజయవాడ తరలించిన పోలీసులు
అచ్చెన్నాయుడుకి కాసేపట్లో వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉందని సమాచారం. వైద్యపరీక్షల అనంతరం విజయవాడలోని అనిశా కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు సమయం ముగియటంతో న్యాయమూర్తి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో జడ్జి ఇంటివద్దనే అచ్చెన్నాయుడు సహా అరెస్టు చేసిన ఆరుగురిని హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చూడండి:ప్రజాప్రతినిధుల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా..?
Last Updated : Jun 12, 2020, 8:32 PM IST