నూతన పోలీస్ యూనిట్ల ఏర్పాటుకు పోలీసు శాఖ ప్రతిపాదనలు
నూతన జిల్లాల ఏర్పాటు లో భాగంగా రాష్ట్రంలో 29 పోలీసు యూనిట్లను ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు.
నూతన పోలీస్ యూనిట్ల ఏర్పాటుకు పోలీసు శాఖ ప్రతిపాదనలు
By
Published : Nov 13, 2020, 10:55 AM IST
నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలో 29 పోలీసు యూనిట్లను ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందులో ఏడు కమిషనరేట్లు కూడా ఉన్నాయి. శాఖాపరంగా పలు ప్రతిపాదనలపై పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కొన్ని చోట్ల జిల్లాల మౌలిక స్వరూపాలకు అనుగుణంగా కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా.. మరికొన్ని చోట్ల నియోజకవర్గాల మార్పులు, చేర్పులను సూచించింది. వేగంగా అభివృద్ధి చెందుతండటంతో పాటు పోర్టు, పారిశ్రామికీకరణ, నగరీకరణ నేపథ్యంలో కాకినాడలో కమిషనరేట్‌ను ప్రతిపాదించారు. ప్రస్తుతం అర్బన్ జిల్లాలుగా ఉన్న రాజమహేంద్రవరం, గుంటూరుల్లోనూ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కృష్ణపట్నం పోర్టు, సెజ్, వేగవంతమైన నగరీకరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నెల్లూరు కమిషనరేట్ ఏర్పాటు అవసరమని వివరించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకు ఒక యూనిట్ చొప్పున 13 పోలీసు యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు అర్బన్ పోలీసు జిల్లాలు గుంటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో కమిషనరేట్లు ఉన్నాయి. ప్రతిపాదిత పోలీసు జిల్లాలు 22 కాగా... విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ల్లో కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిపై ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులతో చర్చలు జరుపుతున్నారు . జిల్లాల నుంచి పోలీస్ స్టేషన్ల వారీగా నివేదికలు తెప్పించుకుని నూతన జిల్లాల రూపకల్పన చేస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు:
ప్రతిపాదిత జిల్లా పోలీసు యూనిట్
పోలీస్ ప్రధాన కేంద్రం
ప్రతిపాదిత పోలీసు కేంద్రంలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలు