ఉద్యోగుల ఫిబ్రవరి 3న తలపెట్టిన 'చలో విజయవాడ'కు పోలీసుల అనుమతి నిరాకరించారు. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా స్పష్టం చేశారు. కొవిడ్ దృష్ట్యా ఉద్యోగసంఘాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉందని అన్నారు. 5 వేల మంది వస్తామని ఉద్యోగులు దరఖాస్తులో పేర్కొన్నారని..,అంతమంది సభకు వస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుందని సీపీ అన్నారు. దయచేసి చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు ఎవరూ రావద్దొని విజ్ఞప్తి చేశారు.
"చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు. కొవిడ్ దృష్ట్యా ఉద్యోగసంఘాలకు అనుమతి ఇవ్వలేదు. 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉంది. 5 వేల మంది వస్తామని ఉద్యోగులు దరఖాస్తులో పేర్కొన్నారు. అంతమంది సభకు వస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుంది. దయచేసి చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు ఎవరూ రావద్దు."-కాంతిరాణా, విజయవాడ సీపీ