కార్పోరేషన్లలో ఫిక్సిడ్ డిపాజిట్ల కుంభకోణంలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల కస్టడీ నేటితో ముగుస్తుంది. ఇప్పటికే రెండు రోజులు విచారించిన పోలీసులు... కస్టడీ ముగిసిన తర్వాత వారిని విజయవాడ కోర్టులో హాజరుపరుస్తారు. ఇదే కేసులో తెలంగాణలో పట్టుబడి ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న నిందితులను ట్రాన్సిట్ వారెంట్ పై తెచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం రాబట్టే అవకాశాలున్నాయి.
FD scam : నేటితో ముగియనున్న నిందితుల పోలీసు కస్టడీ - FD scam news
ఎఫ్డీ కుంభకోణంలో అరెస్టైన నిందితుల పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. కస్టడీ ముగిసిన తర్వాత వారిని పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరుస్తారు.
నేటితో ముగియనున్న నిందితుల పోలీసు కస్టడీ