చేయి తడపనిదే బండి కదలదు. ఎందుకివ్వాలి అని అడిగితే... వేరొక దారిలో పోతావా.. లేక కేసు పెట్టి బండి సీజ్ చేయాలా అంటూ బెదిరింపులు..! కరోనాపై పోరులో ఎంతోమంది పోలీసులు ప్రాణాలకు తెగించి రోడ్డుపై శ్రమిస్తుంటే కాసులు దండుకుంటున్న మరికొందరి తీరిది. విజయవాడకు వచ్చే చనుమోలు వెంకట్రావు పైవంతెనపై హైదరాబాద్ నుంచి రావడానికే తప్ప వెళ్లేందుకు అనుమతి లేదు. కానీ ఇదిగో చేయి తడిపితే గేటు తీసి మరీ పంపిస్తున్నారు. ఒక్కో వాహనం నుంచి 200 నుంచి 500 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చుట్టూ దాదాపు 10 సీసీ కెమెరాలు ఉన్నా యథేచ్ఛగా కానిచ్చేస్తున్నారు.
'చేయి తడపండి.. ముందుకెళ్లండి'
లాక్డౌన్ సమయంలో పోలీసుల సేవలు ఎనలేనివి... ప్రజలను రక్షించడానికి వారి ప్రాణాలు సైతం పణంగా పెడుతుంటే.. కొంత మంది తెర చాటున కాసులు దండుకుంటున్నారు.
లాక్డౌన్లో లంచం పుచ్చుకుంటున్న పోలీసులు
TAGGED:
లాక్డౌన్లో పోలీసుల అవినీతి