విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్యూఆర్ఎం కాలనీలో పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ ఖాదర్ బాషా నేతృత్వంలో మాచవరం, పెనమలూరు, పటమట పోలీస్ స్టేషన్ సిబ్బంది సీఐలు, వంద మంది సిబ్బంది బృందాలుగా విడిపోయి సమస్యాత్మక ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ప్రతి ఇంటికీ తిరిగి అక్కడ నివాసముండే వారి వివరాలు సేకరించారు. ఈ తనిఖీల్లో సీఐలు ప్రభాకర్, సత్యనారాయణ, సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎటువంటి పత్రాలు చూపని 60 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.