MOVIE STYLE CHASING : అబ్బాయి బెంగళూరులో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి.. అమ్మాయి విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని. పాఠశాల దశలో వీరిద్దరి నడుమ చిగురించిన స్నేహం చివరకు ప్రేమగా పరిణమించింది. వీరి ప్రేమను అమ్మాయి తరఫు పెద్దలు నిరాకరించారు. అబ్బాయిది విజయవాడ కాగా, అమ్మాయిది పెనమలూరు. దీంతో బుధవారం ఉదయాన్నే అబ్బాయి నేరుగా పల్సర్ బైక్‌తో అమ్మాయి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈమెను వాహనంపై ఎక్కించుకొని పోరంకి మీదుగా కోల్‌కతా జాతీయరహదారి పైకి ఉరికించాడు. క్షణాల్లో జరిగిపోయిన ఈ సంఘటనతో నిర్ఘాంతపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు వెంటనే పెనమలూరు సీఐ గోవిందరాజుకు సమాచారం అందించారు.
పరారవుతున్న ప్రేమజంటను పట్టుకున్న పోలీసులు, ఎలాగో తెలుసా - latest news in ap
POLICE CAUGHT పాఠశాల దశలో చిగురించిన స్నేహం ప్రేమకు బాటలు వేసింది. అందరి ప్రేమికుల లాగే వీరికి పెద్దలు అడ్డుపడ్డారు. పెద్దలను ఒప్పించలేక, విడిపోయి బతకలేక ఇంట్లో నుంచి పారిపోవాలని నిర్ణయించుకుని, అనుకున్నదే తడవుగా ఇంటి నుంచి బయటపడ్డారు. కానీ వారి కలలు కొద్దిసేపటికే ఆవిరయ్యాయి. ఏమైందో తెలుసుకోవాలంటే ఇది చదవండి
అప్రమత్తమైన ఆయన ఇద్దరు కానిస్టేబుళ్లను వీరిని పట్టుకోవడానికి పంపారు. అబ్బాయి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేస్తూ కానిస్టేబుళ్లు రంగంలోకి దిగారు. అప్పట్నుంచి మొదలైంది రెండు వాహనాల నడుమ ఛేజింగ్. సినీ ఫక్కీలో ముందు వాహనంపై ప్రేమజంట ..వెనుక వాహనంపై పోలీసులు. దాదాపు మూడున్నర గంటల పాటు ఉత్కంఠగా సాగిన ఈ ఛేజింగ్‌కు కొవ్వూరు టోల్‌గేట్ వద్ద బ్రేక్ పడింది. ఈ టోల్‌గేట్ వద్ద ప్రేమికుల ద్విచక్ర వాహనం నెమ్మదించడంతో వెనుక నుంచి వస్తున్న పోలీసులు మెరుపు వేగంతో వీరి వాహనానికి తమ వాహనం అడ్డుపెట్టి నిలిపివేశారు. వీరిని అదుపులోకి తీసుకొని సాయంత్రానికి పెనమలూరు స్టేషన్‌కు తీసుకువచ్చారు. జీవితంలో స్థిరపడిన తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవడం మేలంటూ మేజర్లయిన ప్రేమికులకు సీఐ గోవిందరాజు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇవీ చదవండి: