Thieves robbing in locked houses arrested: విజయవాడలోని పలు ప్రాంతాల్లో.. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనం చేసిన కేడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉంచిన ఎల్‌హెచ్‌ఎంఎస్ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు ప్రత్యేక బృందాలను పంపి నిందితులను అరెస్ట్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ వ్యక్తి.. ఇండోర్‌లోని ఈ ముఠాతో పరిచయం పెంచుకున్నాడు. ఇతను.. దొంగలను విజయవాడకు రప్పిస్తాడు. వీరంతా కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో.. పగలు రెక్కీ నిర్వహిస్తారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని.. రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడతారు.
అయితే.. విజయవాడలో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస నేరాలపై పోలీసులు నిఘా పెట్టారు. కొందరు ఊళ్లకు వెళుతూ.. ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టమ్ ను ఇళ్లలో ఏర్పాటు చేసుకున్నారు. దాని ఆధారంగా నిందితులను సునాయాసంగా పట్టుకోగలిగారు. కాకినాడకు చెందిన వ్యక్తితో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల వెండి, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.