students arrested: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎస్ఎఫ్ఐ పిలుపుతో లెనిన్ సెంటర్ వద్దకు విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. జీవో నంబర్ 77ను రద్దుచేయాలని.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎఫ్ఐ చలో విజయవాడలో ఉద్రిక్తత.. విద్యార్థి నేతల అరెస్ట్ - విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం
students arrested: విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చలో విజయవాడ సందర్భంగా భారీగా తరలివెళ్లిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు.

విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత
విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత
ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి.. బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
ఇదీ చదవండి:"మహిళలకు జగన్ ఇచ్చిన హామీ గోవిందా.. గోవిందా.."