Cheddi gang members arrest: రాష్ట్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చెడ్డీ గ్యాంగ్‌లోని కొందరిని నగర పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనే విషయం పోలీసులు వెల్లడించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సుమారు ముగ్గురు ముఠా సభ్యులను గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని లోతుగా ప్రశ్నిస్తూ మిగిలిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక్కో దాంట్లో ఐదుగురు చొప్పున రెండు ముఠాలు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ నెల 7న పెనమలూరు స్టేషను పరిధిలోని పోరంకి వసంత్‌నగర్‌లో చోరీ చేసిన తర్వాత, ఎక్కడా ముఠా కదలికలు లేవు. నిఘా పెరగడంతో ఇక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయినట్లు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రత్యేక బృందాలతో నిఘా పెంచారు. దీంతో పాటు నగరం నుంచి రెండు పోలీసు బృందాలు ఆ రాష్ట్రానికి వెళ్లాయి.
సెల్‌ఫోన్లు వాడి.. దొరికిపోయారా?
cheddy gang in police custody: ఈ ముఠాల ఆనవాళ్లు దొరకడానికి ప్రధానంగా దొంగలు సెల్‌ఫోన్లు వాడడమే కారణం. వీరు గత నెలలో గుజరాత్ నుంచి రైలులో వచ్చి విజయవాడలో దిగినట్లు తెలిసింది. ఓ రోజంతా వివిధ ప్రాంతాల్లో తిరిగి రెక్కీ నిర్వహించి, ఇళ్లను ఎంపిక చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. చిట్టినగర్, గుంటుపల్లి, పోరంకిలో గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. ఈ ప్రాంతాల్లోని సెల్ టవర్ డంప్‌ను పోలీసులు విశ్లేషించడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయి. మూడుచోట్ల ఉన్న టవర్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిన కాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు దేశాలు, రాష్ట్రాలకు వెళ్లిన వాటిల్లో ప్రధానంగా గుజరాత్ కాల్స్‌పై దృష్టి పెట్టగా.. కొన్ని నెంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వీటికి సంబంధించి సీడీఆర్ వివరాలను తెప్పించుకుని వడపోయగా.. దాహోద్ ప్రాంతానికి ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ ఉన్నట్లు తేలింది. నగరంలో మూడు చోరీల అనంతరం ముఠాలు ఫోన్లు స్విచాఫ్ చేసుకుని గుజరాత్ వెళ్లినట్లు బయటపడింది.
ప్రత్యేక బృందాలతో అన్వేషణ