ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల తాబేళ్లు.. పోలీసుల అదుపులో ముగ్గురు - Turtles illegally moving in Kaikaluru

Turtles illegally moving : కృష్ణాజిల్లా కైకలూరు మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రెండు వాహనాల్లో తరలిస్తున్న నాలుగు వందల కిలోల తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Turtles illegally moving
అక్రమంగా తరలిస్తున్న 400కిలోల తాబేళ్లు...పోలీసుల అదుపులో ముగ్గురు

By

Published : Feb 27, 2022, 4:04 PM IST

Turtles illegally moving : కృష్ణాజిల్లా కైకలూరు మండలంలో నిర్వహించిన తనిఖీల్లో.. పోలీసులు భారీ సంఖ్యలో తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో.. రెండు వాహనాల్లో తరలిస్తున్న నాలుగు వందల కిలోల తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న 400కిలోల తాబేళ్లు...పోలీసుల అదుపులో ముగ్గురు

మండలంలోని భుజబలపట్నం వద్ద రూరల్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 25 గోనె సంచుల్లో.. రెండు వాహనాల ద్వారా తాబేళ్లను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాబేళ్ళను అక్రమందా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రెండు వాహనాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు మండల పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి :Koppavaram Jathara: విచిత్ర వేషధారణలు..పూజారి బడిత పూజ.. కొప్పవరం జాతరలో కోలాహలం

ABOUT THE AUTHOR

...view details