కృష్ణా జిల్లా నున్నలో వాహనాల తనిఖీల్లో ఓ యువకుడు... పోలీస్ డ్రెస్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీయగా... తన తల్లి కోరిక మేరకు పోలీసు ఉద్యోగం సాధించలేక పోయాయని... కానీ ఆమెను సంతోషంగా ఉంచడానికి పోలీస్‌గా సెలెక్ట్ అయ్యానని అబద్ధం చెప్పానని పోలీసులకు తెలిపాడు. విజయవాడలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నానని.. ఇంటికి వెళ్లే క్రమంలో తన తల్లికి చెప్పిన అబద్ధం మేరకు కానిస్టేబుల్ యునిఫాం వేసుకున్నానని ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. అతనిపై నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
తల్లిని సంతోష పెట్టాలని కానిస్టేబుల్ వేషం.. చివరకు ఏమైందంటే.. - విజయవాడలో నకిలీ పోలీస్ అరెస్టు
కానిస్టేబుల్ డ్రెస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని నున్న గ్రామీణా పోలీసులు పట్టుకున్నారు. తన తల్లిని సంతోషంగా ఉంచడానికి పోలీస్ యునిఫాం వేసుకున్నట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పారు.
పెట్టడానికి కానిస్టేబుల్ అవతారం
Last Updated : Aug 2, 2021, 10:17 AM IST