ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వర్ణ ప్యాలెస్ కేసు: రాయపాటి కోడలిని విచారించిన పోలీసులు - రాయపాటి మమత వార్తలు

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం కేసులో రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు విచారించారు. గుంటూరులోని రమేష్ ఆసుపత్రి సీవోవో అయిన ఆమెను విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రశ్నించారు.

Dr. Mamata
Dr. Mamata

By

Published : Aug 14, 2020, 2:42 PM IST

Updated : Aug 14, 2020, 7:42 PM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్​లో అగ్ని ప్రమాదం ఘటనలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు విచారించారు. గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి సీవోవోగా వ్యవహరిస్తున్న ఆమెకు... విచారణకు హాజరుకావాలని పోలీసులు గతంలోనే నోటీసులు ఇచ్చారు. అయితే ఆమె ఇటీవలే కరోనా బారినపడి కోలుకుని హోం ఐసోలేషన్​లో ఉన్నారు. తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు చెప్పటంతో ఆమె శుక్రవారం గుంటూరు నుంచి విజయవాడ వెళ్లారు. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆమెను పోలీసులు ప్రశ్నించారు.

డాక్టర్ మమతను విచారణకు పిలవడంపై ఆమె భర్త, రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఘటన జరిగితే గుంటూరు రమేష్ ఆసుపత్రికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే వైకాపా పభుత్వం తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిందని రాయపాటి రంగారావు ఆరోపించారు.

Last Updated : Aug 14, 2020, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details