Polavaram funds: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ బిల్లుల రూపంలో కేంద్రం రూ.320 కోట్లు తిరిగి చెల్లించినా.. ఆ మొత్తం రాష్ట్రంలోని ఇతర అవసరాలకు మళ్లిపోయింది. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అవసరాలకు ఖర్చు చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్రం ఖర్చుచేసిన దాదాపు రూ.2,100 కోట్ల బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అందులో తాజాగా గతవారం రూ.320 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్బీఐ ఖాతాకు చేరుకున్నాయి. ఆ నిధులు వస్తాయని పోలవరంలో భాగస్వాములు అనేకమంది ఎదురుచూస్తున్నారు. కానీ ఈ రూ.320 కోట్లు పోలవరం అవసరాలకు ఇవ్వలేదు. ఇతర అవసరాలకు ఖర్చుచేయాల్సి వచ్చింది.
మరోవైపు పోలవరం ప్రధాన డ్యాం, ఇతరత్రా నిర్మాణ బిల్లుల రూపంలోనే రూ.900 కోట్ల వరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయని సమాచారం. ఆ నిధులు సకాలంలో అందక పనులు కాస్త వేగం తగ్గాయి. మరోవైపు తమకు నిధులు ఇవ్వట్లేదంటూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. వీరితో దీక్షలు విరమింపజేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు వీరిని కలిసి హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు రాగానే నిర్వాసితుల కోసమే ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో రూ.390 కోట్ల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఆ నిధులు వచ్చాకైనా తమ ఆశలు నెరవేరుతాయా అని ఎదురుచూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం ప్రత్యేక ఖాతా ప్రారంభించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ సన్నాహాలు చేసినా ఏపీ ఆర్థికశాఖ అధికారులు అందుకు ససేమిరా అన్నారు. ¸కేంద్రం తొలుత అడ్వాన్సుగా నిధులిచ్చే పక్షంలో ప్రత్యేక ఖాతా ఏర్పాటుకు అభ్యంతరం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు. ముందే రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఆ తర్వాత కేంద్రం ఇస్తున్నందువల్ల ఇలా ప్రత్యేక ఖాతా ఏర్పాటుచేయడం సాధ్యం కాదని ఆర్థికశాఖ పేర్కొంది.
కేంద్ర బడ్జెట్ నుంచి..