దట్టంగా అలుముకున్న పొగమంచు విజయవాడను పొగమంచు కమ్మేసింది. నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. బారెడు పొద్దెక్కినా... మంచు తెరలు తొలగలేదు. పొగమంచు ముసుగు వీడలేదు. ఉదయం 9 గంటలైనా భానుడి దర్శనం కాలేదు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయాన్నే విద్యాలయాలకు , కార్యాలయాలకు వెళ్లేవారు మంచు కారణంగా సమస్యలు ఎదుర్కొన్నారు.