ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PNEUMONIA CASES: కొవిడ్ ప్రభావం.. రెట్టింపు అవుతున్న న్యుమోనియా కేసులు

సాధారణ జలుబుతో ప్రారంభయ్యే న్యుమోనియా.... ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది . కొవిడ్‌ బాధితులకు న్యుమోనియా ప్రాణాంతకంగా మారే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ముందుగా గుర్తిస్తే సులువుగా తగ్గించవచ్చని చెబుతున్నారు. ప్రపంచ న్యుమోనియా దినం(world pneumonia day) సందర్భంగా... దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

రెట్టింపు అవుతున్న న్యుమోనియా కేసులు
రెట్టింపు అవుతున్న న్యుమోనియా కేసులు

By

Published : Nov 13, 2021, 8:35 PM IST

కొవిడ్ కారణంగా రెట్టింపు అవుతున్న న్యుమోనియా కేసులు

కొవిడ్ కారణంగా న్యుమోనియా(pneumonia) కేసులు రెట్టింపు అవుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలోపు మరణించే చిన్నారుల్లో అధికులు ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారే ఉంటున్నారని చెబుతున్నారు. రెండేళ్ల నుంచి పోస్ట్ కొవిడ్ బ్యాక్టీరియల్ న్యుమోనియా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండున్నర మిలియన్ల కొత్త కేసులు వస్తున్నాయని పేర్కొన్నారు. న్యుమోనియా వైరస్‌ వల్ల వస్తుందని.. జలుబుతో ప్రారంభమై... మెల్లగా ఊపిరితిత్తులకు చేరుతుందని చెబుతున్నారు. సాధారణంగా న్యుమోనియా ఒకరి నుంచి మరొకరికి సోకదని... ప్రస్తుతం కొవిడ్ తర్వాత వచ్చే బ్యాక్టీరియల్ న్యుమోనియా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.

న్యుమోనియా వల్ల అధిక జ్వరం, ఛాతీలో తీవ్ర నొప్పి వస్తుంది. ఆకలి, నిద్ర తగ్గిపోవటం వంటి లక్షణాలుంటాయి. వీటిని మొదట్లోనే గుర్తిస్తే ఔషధాలతో సులువుగా తగ్గించుకోవచ్చు. కళ్లు ఎర్రబడటం, జలుబు, దగ్గు, జ్వరం వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇస్తే న్యుమోనియా బారి నుంచి పిల్లలను కాపాడవచ్చు. -వైద్యులు

ఇదీ చదవండి:

పుట్టిన బిడ్డను టాయిలెట్​లో వదిలేసిన మైనర్

ABOUT THE AUTHOR

...view details