ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SOMU : 'దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని పని చేస్తున్నారు' - somu veerraju

విజయవాడ భాజపా కార్యాలయంలో 'సేవా సమర్పణ అభియాన్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ జీవిత విశేషాలను వివరిస్తూ ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేశాభివృద్ధే లక్ష్యంగా మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు.

విజయవాడలో మోదీ ఫొటో గ్యాలరీ ప్రదర్శన
విజయవాడలో మోదీ ఫొటో గ్యాలరీ ప్రదర్శన

By

Published : Sep 19, 2021, 1:42 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భాజపా నిర్వహిస్తోన్న "సేవా సమర్పణ అభియాన్" కార్యక్రమాల్లో భాగంగా... విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. మోదీ జీవిత విశేషాలను వివరిస్తూ ఛాయాచిత్రాలు ఉంచారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రారంభించారు. దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నిరంతరం కృషి చేస్తున్నారని, దేశంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో సమదృష్టి సారిస్తున్నారని కొనియాడారు. రాజధాని అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. రహదారులు, రైల్వేలైన్ల అభివృద్ధికి కేంద్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details