ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు భీమవరంలో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన - సీఎం భీమవరం టూర్

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూలును అధికారులు విడుదల చేశారు.

రేపు భీమవరంలో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన
రేపు భీమవరంలో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన

By

Published : Jul 3, 2022, 10:39 PM IST

Updated : Jul 4, 2022, 6:31 AM IST

సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధానితోపాటు సీఎం పాల్గొననున్నారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి బయలుదేరతారు. 10.10 గంటలకు హైదరాబాద్​ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరుకోనున్న ప్రధాని నరేంద్రమోదీకి.. స్వాగతం పలుకుతారు. 10.15 గంటలకు సీఎం గన్నవరం నుంచి భీమవరం బయలుదేరనున్నారు. ప్రధాని హెలికాప్టర్​లో భీమవరం చేరుకోనున్నారు.

10.50 గంటలకు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 30 అడుగులు అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు భీమవరం నుంచి సీఎం తిరుగుపయనం కానుండగా.. ప్రధాని 12.30 గంటలకు హెలికాప్టర్​లో బయల్దేరి విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి సీఎం జగన్ వీడ్కోలు పలుకుతారు.

ఇవీ చూడండి :

Last Updated : Jul 4, 2022, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details