సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆయన కోలుకున్న అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్మాను దానం చేశారు. 2001లో రోడ్డు ప్రమాదానికి గురైన 12 ఏళ్ల పాపకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడగలిమన్నారు. ప్లాస్మా దానం చేసే వారు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
కరోనా వారియర్స్ వాలంటీర్‌గా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదనాంలాగే ప్లాస్మాను సైతం సులువుగా ఇవ్వవచ్చని అన్నారు. ప్లాస్మా దానం చేసినందుకు ప్రవీణ్ ప్రకాష్‌కు జీజీహెచ్ సూపరింటెండ్ సర్టిఫికెట్‌ను అందజేశారు. కరోనా నుంచి కోలుకున్న రెండు నెలలలోపు ప్లాస్మా దానం చేయవచ్చని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండ్ డా.శివశంకర్ అన్నారు.