New districts meeting: జిల్లాల పునర్విభజన అంశంపై ప్రణాళిక శాఖ సమావేశం నిర్వహించింది. ఏపీ ప్రణాళిక విభాగంలో ప్రారంభమైన ఈ సమావేశానికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రణాళిక విభాగం సలహాలు, సూచనలు తీసుకోనుంది. సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్ధార్ద జైన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నాలుగు సమావేశాలు...
13 జిల్లాల కలెక్టర్లతో నేటి నుంచి ఈ నెల 28 మధ్య విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. విజ్ఞప్తుల గురించి ఈ సమావేశాల్లో జిల్లాల కలెక్టర్లు వివరించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ ఆదేశాలు జారీచేశారు. నేడు విజయవాడలో... కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో, 24న తిరుపతిలో... చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో, 26న అనంతపురంలో... అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో, 28న విశాఖపట్నంలో... విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు ఉంటాయి.
ఇదీ చదవండి :
New Districts in AP: నూతన జిల్లాలపై మరో ముందడుగు.. నేటి నుంచి సమీక్ష సమావేశాలు