ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పితాని కుమారుడిపై స్పష్టమైన ఆరోపణలున్నాయి.. అందుకే బెయిల్ ఇవ్వలేదు' - ఈఎస్​ఐ కేసులో పితాని కుమారుడు వెంకట సురేశ్ వార్తలు

ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకటసురేశ్​పై స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు తీర్పు ప్రతి అందుబాటులోకి వచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలున్నాయని న్యాయస్థానం చెప్పింది. అందుకే బెయిల్ పిటిషన్​ను కొట్టేశామని స్పష్టంచేసింది.

pitani satyanarayana son venkata suresh bail petition in high court on esi case
ఏపీ హైకోర్టు

By

Published : Jul 16, 2020, 8:43 AM IST

ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకటసురేశ్​పై స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. అతనికి డబ్బులిచ్చినట్లు అనిశా ఆధికారుల దర్యాప్తులో ఔషధ సరఫరాదారులు వాంగ్మూలం ఇచ్చారని గుర్తుచేసింది . ఈ కేసులో భారీగా నిధులు దుర్వినియోగం అయినట్లు స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, పిటిషనర్‌కు ముందస్తు బెయిలిస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే అనిశా వాదనలను తోసిపుచ్చలేమని పేర్కొంది.

సామాజిక - ఆర్థిక నేరాలు.. దేశ ఆర్థిక స్థితిగతులు, వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని ప్రభావం చేస్తాయన్నదాంట్లో సందేహమే లేదని పేర్కొంది. ఈ విషయమై అనిశా వాదన వాస్తవమని తెలిపింది. అనిశా పీపీ వాదనలు, బెయిల్ ఇచ్చే సందర్భంలో ఏ అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలనే విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. లలిత ఇచ్చిన తీర్పు ప్రతి అందుబాటులోకి వచ్చింది. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అనిశా నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పితాని తనయుడు వెంకటసురేశ్ హైకోర్టును ఆశ్రయించిన క్రమంలో న్యాయస్థానం పై విధంగా స్పందించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details