ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రాణ వాయువు తయారీలో మేటి 'రావి చెట్టు'.. నిపుణుల మాటేంటంటే..!! - pipal tree in generation of oxygen

ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ దాటికి అందరినోట ఆక్సిజన్ గురించి నిత్యం వింటున్నాం. కానీ తులసి చెట్టు తరువాత ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేసే చెట్టుగా రావి చెట్టుకు పురాణకాలం నుంచి ప్రముఖ స్థానం ఉంది. ఆ చెట్టు ప్రత్యేకత ఏంటి..? ఇంతకీ నిపుణులు ఏమంటున్నారు..? ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం.

pipal tree in oxygen generation
ప్రాణ వాయువు తయారీలో మేటి రావి

By

Published : May 6, 2021, 10:19 PM IST

ప్రాణ వాయువు తయారీలో మేటి 'రావి చెట్టు'

కరోనా ప్రభావంతో... ప్రాణవాయువు కోసం పాకులాడాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రకృతి నుంచి సహజంగా లభించే ఆక్సిజన్‌ను కాలరాస్తున్నందుకేనేమో.. కృత్రిమ పద్ధతిలో ఉత్పత్తి అయ్యే వాయువు కోసం పాట్లు పడాల్సిన పరిస్థితి దాపరించింది. డబ్బులు పోసి ప్రాణవాయువును కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం చుట్టుకుంది. చెట్లనుంచి సహజంగా లభించే ఆక్సిజన్‌ విలువను కరోనా మహమ్మారి మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించింది.

ఈ పరిస్థితుల్లో ప్రాణవాయువును ఎక్కువగా విడుదల చేసే చెట్లును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందునా రావి చెట్టు కింద సేదతీరితే ప్రాణవాయువుకు లోటే ఉండదంటున్నారు నిపుణులు. పెద్దఎత్తున డబ్బులు చెల్లించి ప్రాణ వాయువును కొనాల్సిన దుస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడే బాధ్యతను తలకెత్తుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మెుక్కల పెంపకంతోనే మనుగడ:

మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఎక్కువగా చెట్లను పెంచుతూ పచ్చదనాన్ని నింపితే.. మనకు ఆహ్లాదమే కాక మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. ముఖ్యంగా చెట్ల ద్వారా సహజసిద్ధంగా లభించే ప్రాణవాయువు మనిషి మనుగడకు ఎంతో కీలకం. తులసి మొక్క ద్వారా ఆక్సిజన్‌ లభిస్తుందనే ప్రతి ఇంటిలోనూ ఆ మొక్కను పెంచాలని చెబుతూ ఉంటారు. తులసి తర్వాత ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేసే చెట్టుగా రావికి గుర్తింపు ఉంది. రాత్రి సమయాల్లోనూ కార్భన్ డై ఆక్సైడ్‌ పీల్చుకుని ఆక్సిజన్‌ విడుదల చేయడం ఈ చెట్టు ప్రత్యేకత.

గీతలోనూ రావి ప్రస్థావన:

పురాణాల్లోనూ రావి చెట్టు ప్రాముఖ్యత గురించి చెప్పారు. భగవద్గీతలోని 15 వ అధ్యాయంలోని ఓ శ్లోకంలో రావి చెట్టును భగవంతుని ప్రతిరూపంగా వర్ణించారు. సూర్యుని కిరణాలలో ఎంతటి జీవశక్తి దాగి ఉందో.. అలాగే రవికి ప్రతిరూపంగా భూమిపై ఆవిర్భవించిన రావి చెట్టుకు అంతే శక్తి ఉందని విశ్వాసం. జీవ కోటికి ప్రాణవాయువును నిరంతరం అందిస్తూ ఉంటుంది. రావి చెట్టులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఔషధాలల్లో రావి చెట్టు ఆకులు, కాయలు, బెరడును వాడుతున్నారు. కరోనా కాలంలో ఈచెట్టు గాలిని పీల్చుకుంటే సత్ఫలితాలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

తహసీల్దార్​ కార్యాలయంలో..

కృష్ణా జిల్లా మోపిదేవి తహసీల్దార్‌ కార్యాలయంలో నీరు చెట్టు పథకంలో భాగంగా నాటిన రావి చెట్టు ఎంతో సత్ఫలితాలనిస్తోంది. రోజు వందల మంది దాని కింద సేద తీరుతున్నారు. ఎంతో మందికి ఆక్సిజన్‌ను ఇస్తూ ఉపయోగపడుతోంది. ఇక్కడి సిబ్బంది ఈ చెట్టు కిందనే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. వేలాది పక్షులు ఈ చెట్టుపై వాలి కిలకిల రావాలతో సందడి చేస్తాయి.

కరోనా రోగులకు రావి చెట్టుకింద చికిత్స..

ఉత్తరప్రదేశ్‌లోని తిల్‌హర్‌ పట్టణంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో పడకల్లేక.. రావి చెట్టు కింద ఆక్సిజన్‌ ఎక్కువ ఉంటుందని.. అక్కడే ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి: సుప్రీం కోర్టు

'పద్ధతి మార్చుకొని ప్రజల ప్రాణాలు కాపాడండి'

ABOUT THE AUTHOR

...view details