అక్రమ, అవినీతి సంపాదనలో వాటాలు కుదరక, వైకాపా నేతలు వారిలో వారే కుమ్ములాడుకుంటున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, తప్పుడు పనులకు సహకరించడం లేదని సొంత పార్టీ వారిపైనే కత్తులు దూస్తున్నారని విమర్శించారు. సందీప్, సురేశ్ ల ప్రకటనలు, సెల్ఫీ వీడియోలే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని, ప్రజలను సర్వనాశనం చేసిన వైకాపా ప్రభుత్వం, చివరకు సొంత పార్టీ వారినే చంపుకొని తినే సర్పజాతిలా తయారైందని మాణిక్య రావు ఆక్షేపించారు.
'అవినీతిలో వాటాలు కుదరక.. వారే దాడులు చేసుకుంటున్నారు'
తెదేపా నేతలపై, దళితులపై దాడులు చేసిన వైకాపా నేతలు తాజాగా సొంతపార్టీ నేతలపైనా దాడులు చేసుకుంటున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు.
'అవినీతిలో వాటాలు కుదరక వారిలో వారే దాడులు చేసుకుంటున్నారు'