ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు వింత వ్యాధి ప్రబలేది కాదు' - పిల్లి మాణిక్యరావు తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రబలుతున్న వింత వ్యాధి ఘటనను ముఖ్యమంత్రి జగన్ సీరియస్​గా తీసుకుని పర్యవేక్షించాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. అక్కడే మకాం వేసి వ్యాధికి గల కారణాలను అన్వేషించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు.

అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు వింత వ్యాధి ప్రబలేది కాదు
అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు వింత వ్యాధి ప్రబలేది కాదు

By

Published : Jan 22, 2021, 5:30 PM IST

ఏలూరులో వింతవ్యాధి ప్రబలినప్పుడే ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉంటే, భీమడోలు, పూళ్ల, కొమిరేపల్లిలో వ్యాధి ప్రబలేది కాదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రబలుతున్న వింత వ్యాధి ఘటనను సీఎం జగన్ సీరియస్​గా తీసుకుని పర్యవేక్షించాలని కోరారు. సీఎస్, అధికారులు వెళ్లారని కాలయాపన చేయకుండా ముఖ్యమంత్రి తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలన్నారు. అక్కడే మకాం వేసి వ్యాధికి గల కారణాలను అన్వేషించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు.

ప్రజలను పీడించుకుతినటం, హిందూమతంపై దాడిచేయటం, ప్రతిపక్షాలపై అక్రమకేసులుపెట్టి వేధించటం వంటి చర్యలపై చూపుతున్న శ్రద్ధను ప్రజారోగ్యం కాపాడేందుకు పెట్టాలని హితవు పలికారు.

ఇదీచదవండి:అంతుచిక్కని వ్యాధితో 21 మంది అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details